సాధారణంగా చేపలు నీళ్లలో ఉంటేనే బతుకుతాయి. వాటికి ఈదడం తప్పితే ఇంకేం తెలియదు. నీళ్లలో నుంచి తీసి భూమ్మీద వేస్తే అల్లాడిపోతాయి. వెంటనే చనిపోతాయి. కానీ మీకు ఓ చేప గురించి చెప్పాలి. అది నీళ్లలో ఈదడం మాత్రమే కాదు, నడుస్తుంది కూడా. దీనికి చేతులు ఉంటాయి. ఆ చేతులతో నీళ్లలో అది నడవగలదు. అందుకే దాన్ని నడిచే చేప అని పిలుస్తారు. నిజానికి ఇది అరుదైన జాతికి చెందిన చేప. 22 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తాజాగా కనిపించింది. తస్మానియన్ కోస్ట్‌లో ఈ చేప కనిపించింది. ఇది ఆస్ట్రేలియాకే చెందిన చేప. దీన్ని పింక్ హాండ్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు ఇది కేవలం 4 సార్లే కనిపించిందట.
ఈ చేప మెరైన్ పార్క్‌లో సముద్రం అడుగు భాగంలో ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కింది. సముద్రం లోపల ఉన్న జీవులపై అధ్యయనం చేస్తున్న తస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, మెరైన్ బయాలజిస్ట్ నెలివ్లే సముద్రం అడుగున కెమెరాలను ఏర్పాటు చేయించారు. అప్పుడు ఈ అరుదైన జాతికి చెందిన చేప కెమెరాకు చిక్కింది. తస్మనియాలో 1999లో ఈ చేప చివరి సారి కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ చేప కనిపించడం. అందుకే ఈ చేపలను అంతరించిపోతున్న జాతితాలో చేర్చారు.