మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. దీంతో టాలీవుడ్‌లో మా ఎన్నికల సందడి నెలకొంది. రియల్ హీరో సోనూసూద్ కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం టాలీవుడ్ లో జరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది మందిని ఆదుకున్న సోనూసూద్‌ను అధ్యక్ష బరిలో నిలిపితే మాలో ఎటువంటి వివాదాలు ఉండవని పలువురు సినీ ప్రముఖులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేయాలని సోనూసూద్ పై కొందరు సినీ ప్రముఖులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అయితే అధ్యక్ష పదవికి సోనూసూద్ పోటీ చేస్తారన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశంపై సోనూసూద్ కూడా ఇంకా స్పందించలేదు.
మా అధ్యక్ష పదవి కోసం ఇద్దరే బరిలో ఉండేవారు. అయితే ఈసారి ఐదుగురు పోటీ చేస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమతో పాటు తెలంగాణకు చెందిన మరో నటుడు సీవీఎల్ నరసింహారావు మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.