ఓ వైపు రాజకీయాలు, మరో వైపు ఇరు రాష్ట్రాల మధ్య నీటి గొడవ, కోవిడ్ గొడవ… వీటన్నింటితో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీ బిజీగా ఉంటున్నారు. తాజాగా కడప జిల్లా బద్వేలులోనూ సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇంతటి బిజీలో సీఎం జగన్ క్రికెట్ ఆడి అందర్నీ అలరించారు. వైఎస్ రాజారెడ్డి పేరు మీద ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ శంకు స్థాపన తర్వాత సీఎం జగన్ సరదాగా క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టి, రెండు బంతులు ఆడారు. ఈ ఆట తర్వాత బ్యాట్ పై సీఎం జగన్ సంతకం కూడా చేశారు.