మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభావర్త. చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. మోప ార్ రమేష్ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తీ సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 1న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నారు. అన్నా చెల్లెల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్ కీల పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో స్వాగ్ ఆఫ్ భోళా పేరుతో రిలీజ్ చేసిన ప్రీ లుక్ మెగాభిమానులను ఆకట్టుకోగా ఇప్పుడు ఫస్ట్ లుక్ కోసం ఆసక్తి నెలకొంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర తన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)