గూగుల్ సంస్థకు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంతో 500 మిలియన్ యూరోలు ఫైన్ విధిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. భారత్ కరెన్సీలో జరిమానా విలువ రూ.4,415 కోట్లుగా ఉంది. ఇప్పటికే పలు దేశాలు డిజిటల్ కంటెంట్ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా జరిమానాపై గూగుల్ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.