కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు నిజామాబాద్ మాజీ మేయర్, ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ తెలిపారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని బలపర్చడానికే తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నానని అన్నారు. తన తండ్రి డీఎస్ కోసం టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నానని చెప్పారు. కానీ అది కండువా కాదు.. గొడ్డలి అని తనకు తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పోలిస్తే టీఆర్‌ఎస్ పార్టీయే కాదన్నారు. కడుపులో కోపం ఉన్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తన తమ్ముడు ఏ పార్టీలో ఉంటే, తనకేంటి అన్నారు. త్వరలోనే ఢల్లీి వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్నారు.
హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని కలిసిన ఎర్ర శేఖర్ మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతానని వెల్లడిరచారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని భూపాలపల్లి సీనియర్ నాయకుడు గండ్ర సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.