అడివి శేష్ హీరోగా టైటిల్ రోల్ చేస్తున్న సినిమా మేజర్. 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్టన్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా డైరెక్టర్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మేజర్‌లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం, ఇలా మేజర్ సందీప్ జీవితంలో అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి లవ్ ట్రాక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్టూడెంట్ జీవితంలో సందీప్ ఉన్నిక్రిష్ణన్ లవ్ ట్రాక్ ఎంత ఫన్నీగా సాగిందో చూపిస్తూ సాగుతుందీ సాంగ్. స్టార్ హీరో మహేశ్ బాబు ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 2022 జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏGఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)