సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో విధాత ప్రొడక్షన్ పతాకంపై సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి నటీనటులుగా వివేక్ పోతిగేని దర్శకత్వంలో ఉపేన్ నడిపల్లి యథార్థ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం సాచి. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టిస్ట్ బిందుపై చిత్రీకరించిన ముహుర్తపూ సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత రామ్‌మోహన్ రావు గౌరవ దర్శకత్వం వహించగా, సత్యానంద్ మాస్టర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయాలనే మంచి కన్సెప్ట్‌తో తీస్తున్న సాచి సినిమా పెద్ద విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు భావితరాలకు అవసరం అని అన్నారు. వివేక్ పొతిగేని మాట్లాడుతూ ఖమ్మంలో జరిగిన వాస్తవ ఘటనతో సాచి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను అన్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నాం అన్నారు ఉపెన్ నడిపల్లి. ఈ చిత్రానికి సంగీతం: వి.భరద్వాజ్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)