మాలీవుడ్ నుంచి కబురందుకున్నారట హీరోయిన్ సమంత. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో కింగ్ ఆఫ్ కోథా అనే గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కునుంది. విభిన్నమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా సామ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. చిత్ర యూనిట్ సమంతను సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, సమంత గతంలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి చిత్రంలో నటించారు. కానీ, అందులో ఇద్దరికీ కాంబినేషన్ సీన్లు లేవు.ఈ వార్త నిజమైతే సమంతకు మలయాళంలో ఇదే తొలి సినిమా అవుతుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)