తెలంగాణ సాంస్కృతిక సారథిగా మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కళాకారులకు ఉద్యోగాలు, గుర్తింపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైఎస్ చైర్మన్ వినోద్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ పాల్గొన్నారు.