ఉదయ్‌శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వచ్చింది గర్ల్‌ఫ్ర్రెండూ. జెన్సీ కథానాయిక. గురు పవన్ దర్శకుడు. ఆర్. సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది. కథ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని తెలిసింది. ఈ చిత్రంతో ఉదయ్‌కు మంచి విజయం దక్కుతుందని అశిస్తున్నా అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ వెంకటేష్ గారు మా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లంగ్ ఎలిమెంట్స్ కూడా చిత్రంలో వుంటాయి. ఒకే రోజు జరిగే కథ ఇది. హీరో
ఉదయ్‌శంకర్‌కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెడుతుంది అన్నారు. యువతరం మెచ్చే కథతో రూపొందిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా అన్నారు చిత్ర నిర్మాత అట్లూరి నారాయణ రావు. హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఒక్కరోజులో జరిగే కథ ఇది. అన్ని రకాల భావోద్వేగాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా యువతరానికి బాగా నచ్చుతుంది అన్నారు. జెన్నీఫర్ మాట్లాడుతూ ఒకరోజులో జరిగే ఈ ప్రేమకథలో చాలా భావోద్వేగాలున్నాయన్నారు. మధునందన్, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 11న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: గిప్టన్. ఛాయాగ్రహణం: సిద్దం మనోహర్.