సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేష్, యువ నటుడు రానా కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో సుందర్ ఆరోన్ నిర్మించిన ఈ సిరీస్‌కు సంబంధించిన హై ఆక్టేన్ ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేశారు. సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఇలాంటి కథలో రానాతో కలిసి నటించడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇందులో నేను పోషించిన నాగ పాత్ర నాకు పూర్తిగా కొత్తగా వుంది. ఈ పాత్రలో భిన్న కోణాలుంటాయి. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు అన్నారు. రానా మాట్లాడుతూ బాబాయ్ వెంకీతో నా మొదటి కాంబినేషన్. రానా నాయుడు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. రానా, నాగ మధ్యలో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులు అందరూ ఆస్వాదిస్తారు అన్నారు. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రీమియర్ కాబోతున్నది. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థితో పాటు కరణ్ అన్షుమాన్, సుపర్ వర్మ, సుందర్ ఆరోన్, మోనికా షెర్గిల్, విపి కంటెంట్, నెట్ఫ్లిక్స్ ఇండియా పాల్గొన్నారు.