అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ -2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. నేడు అఖిల్ జన్మదినం (ఏప్రిల్ 8)సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో భారీ పేలుడు జరుగుతున్నప్పుడు, మెషిన్ గన్ పట్టుకుని ఫెరోషియస్ గా నడుచుకుంటూ వస్తూ అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించాడు.ఇందులో అఖిల్ స్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ గూఢచారి పాత్రలో కనిపిస్తారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. మమ్ముట్టి పాత్ర కీలకంగా ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హిప్‌హాప్ తమిళ, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.
















