Namaste NRI

అమెరికాలో మరో తెలుగు సంస్థ ఏర్పాటు

ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి కోసం మరో కొత్త సంస్థ పురుడుపోసుకొన్నది. మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (మాటా) పేరిట ఒక కొత్త తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఇటీవలే న్యూజెర్సీలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలస్‌లో జరిగిన మాటా గ్రాండ్‌ లాంచ్‌లో దాదాపు 2,500 మంది భారతీయులు పాల్గొన్నారు.

సేవ, సంసృతి, సమానత్వం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ, యువతను ప్రోత్సహిస్తూ, వయోధికుల ఉత్తమ సంరక్షణే లక్ష్యంగా మాటా పనిచేస్తుందని వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌ గనగోని తెలిపారు. న్యూజెర్సీ, న్యూయార్‌, మేరీల్యాండ్‌, వర్జీనియా, డల్లాస్‌, హ్యూస్టన్‌, ఆస్టిన్‌, అట్లాంటా, చికాగో, డెట్రాయిట్‌, కాన్సాస్‌ సిటీ, నార్త్‌ కరోలినా వంటి దాదాపు 20 నగరాల్లో మాటా తన చాప్టర్‌లను ప్రారంభించింది. 2వేల మంది జీవితకాల సభ్యులుగా నమోదైనట్టు మాటా ప్రతినిధులు ప్రదీప్‌ సామల, లక్ష్మీ మోపర్తిలు తెలిపారు.

గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ను మాటా కోర్ టీమ్ సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, శ్రీ అట్లూరి, శ్రీధర్ చిల్లర, దాము గేదెల, స్వాతి అట్లూరి, జితేందర్ రెడ్డి, డాక్టర్ స్టానెలీ రెడ్డి, పవన్ దరిసి, ప్రసాద్ కూనిశెట్టి, శేఖర్ వెంపరాల, హరి ఎప్పనపల్లి, గంగాధర్ వుప్పాల, కిరణ్ దుద్దగి, విజయ్ భాస్కర్ కలాల్, ప్రవీణ్ గూడూరు, మహేందర్ నరాల, రామ్ మోహన్ చిన్నాల, వెంకట్ సుంకిరెడ్డి, శేఖర్ రెడ్డి కోనాల, శ్రీనివాస్ కనకం, లక్ష్మీ మోపర్తి, కృష్ణ సిద్ధాడ, గోపి వూట్కూరి, రఘు మోడుపోజు, వేణు గోపాల్ గిరి, వెంకీ మస్తీ, అంజన్ కర్నాటి, గిరి కంభంమెట్టు, రఘురాం రెండుచింతల, గిరిజా మాదాసి, శ్రీధర్ గుడాల, బాబురావు సామల, రాజ్ ఆనందేసి, టోనీ జన్ను, సత్య నేమన, రవి కరీంగుల, రూపక్ కల్లూరి, దీపక్ కట్ట, శ్రీనివాస్ కోమట్‌పల్లి, సురేష్ ఖజానా, సుధాకర్ ఉప్పల, శిరీష గుండపనేని, జయ తెలుకుంట్ల, మల్లిక్ రెడ్డి, ఉజ్వల్ కస్తాల, మహేష్ చల్లూరి, పురుషోత్తం అనుమోలు, వెంకట్ చిలకమూరి, చైతు మద్దూరి, వెకటేష్ ముత్యాల మరియు కృష్ణశ్రీ గందం మరియు మల్లిక్ రావు బొల్లా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events