Namaste NRI

చైనాకు వ్య‌తిరేకంగా…పాకిస్థాన్‌లో ఆందోళ‌న‌లు

పాకిస్థాన్‌లో చైనాకు వ్య‌తిరేకంగా  ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. క‌రాచీలో చైనీయుల‌కు చెందిన వ్యాపారాల‌ను ప్ర‌స్తుతం పాక్షికంగా పోలీసులు మూసివేస్తున్నారు. ఉగ్ర‌వాద దాడుల్ని నియంత్రించే ఉద్దేశంతో పోలీసులు ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. పాకిస్థాన్‌లో సెక్యూర్టీ ప‌రిస్థితి మ‌రీ దిగ‌జారిపోతుంద‌ని, అందుకే తాత్కాలికంగా ఇస్లామాబాద్‌లో ఉన్న కౌన్సులేట్‌ను మూసివేస్తున్న‌ట్లు ఇటీవ‌ల చైనా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. పాక్‌లో ఉన్న చైనీయులు అంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా డ్రాగ‌న్ దేశ ఎంబ‌సీ ఆదేశాలు జారీ చేసింది.

చైనా పౌరుల‌ను ర‌క్షించ‌డంలో పాకిస్తాన్ విఫ‌లం అవుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పాక్ అధికారులు నిర్లక్ష్యం వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు బీజింగ్ ఆరోపిస్తున్న‌ది. అయితే చైనా వ‌ద్ద తీసుకున్న రుణం విష‌యంలోనూ రెండు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను బ‌ల‌హీన‌ప‌రుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆ రుణాన్ని మాఫీ చేయాల‌ని, లేదా డెడ్‌లైన్‌ను పెంచాల‌ని కోరుతూ డ్రాగ‌న్‌పై పాకిస్థాన్ వ‌త్తిడి తెలుస్తున్న‌ట్లు  తెలిసిందే.

 మ‌రో వైపు పాక్ ప్రాజెక్టుల్లో ప‌నిచేస్తున్న చైనా కార్మికుల‌పై వ్య‌తిరేకత వ్య‌క్తం అవుతున్న‌ది. దీంతో పాక్ కార్మికులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. దాసు ప‌వ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద ఓ చైనా కార్మికుడు దైవ‌దూష‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు పాక్ కార్మికులు ఆరోపించారు. దీంతో ఆ చైనా ఉద్యోగిని అరెస్టు చేశారు. ప్రార్థ‌న‌ల‌కు ఎక్కువ స‌మ‌యం తీసుకోవ‌డం వ‌ల్ల ప‌నులు సాఫీగా సాగ‌డం లేద‌ని చైనా వ్య‌క్తి ఆరోపించారు. దీన్ని పాక్ కార్మికులు ఖండించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events