Namaste NRI

ఓజీ సెట్‌లో అడుగుపెట్టిన పవన్‌కల్యాణ్‌

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో ఓజీ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 15నుంచి ముంబయిలో రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా సెట్‌లోకి పవన్‌కల్యాణ్‌ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం కొన్ని ఫొటోల్ని సోషల్‌మీడియాలో పంచుకుంది. బ్లాక్‌హుడీ ధరించిన పవన్‌కల్యాణ్‌  స్టెలిష్‌ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ముంబయి పరిసర ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు చిత్రీకరణ జరుగుతుంది. పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్‌, సంగీతం: తమన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, రచన-దర్శకత్వం: సుజీత్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events