పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా దర్శక నిర్మాతలు ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. ఎంతో కోపంగా, చేతిలో గధ పట్టుకొని కనిపిస్తున్న హనుమంతుడి పోస్టర్‌ను విడుదల చేశారు. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచే ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 6వ తేదీన తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.


