దేశీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలు పెరిగాయి. టికెట్ ధరలను 9.83`12.82 శాతం మధ్య పెంచుతూ పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకున్నది. కరోనా నేపథ్యంలో వైమానిక రంగం నష్టపోకుండా, అదే సమయంలో విమాన ప్రయాణ సంస్థలు ప్రజల నుంచి ఎక్కుడ డబ్బు వసూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం విమాన టికెట్ల రేట్లపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు విధించింది. తాజాగా ఆ పరిమితులను పెంచింది. విమాన టికెట్ ధరలను ప్రయాణ సమయం ఆధారంగా నిర్ణయిస్తారు.