Namaste NRI

దయ్యానికి కథ చెప్పాల్సి వ‌స్తే ?

యశ్విన్‌, దినేష్‌తేజ్‌, అజయ్‌, బాలాదిత్య, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కథా కేళి. సతీష్‌ వేగేశ్న దర్శకుడు. ఈ చిత్ర లోగోను అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఆవిష్కరించారు. టీజర్‌ను హరీష్‌శంకర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ శతమానం భవతి సినిమా మా బ్యానర్‌లో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడదే పేరుతో దర్శకుడు సతీష్ బ్యానర్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది.   విభిన్న కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతం కావాలని అన్నారు. దర్శకుడు సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ సాధారణంగా అందరూ దెయ్యం కథలను చెబుతారు. కానీ దెయ్యానికే కథ చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా పాయింట్‌. హారర్‌ కామెడీ కథాంశంతో అందరికి కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు.  ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, చిత్ర సమర్పకుడు చింతా గోపాల కృష్ణా రెడ్డి, ఎస్.కె.బాలచంద్రన్, దాము నర్రావుల, పూజితా పొన్నాడ, అజయ్, నందిని, యశ్విన్, దినేశ్ తేజ్, బాలాదిత్య పాల్గొన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: ఎస్‌.కె.బాలచంద్రన్‌, రచన-దర్శకత్వం: సతీష్‌ వేగేశ్న.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events