Namaste NRI

50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై ..

రష్యా  50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 11న లూనా-25 ల్యాండర్‌ను చంద్రుడిపై ప్రయోగించనున్నట్టు రష్యా వెల్లడించింది. ముందు జాగ్రత్తగా ఖబరోవ్‌స్క్‌ ప్రాంతంలోని షక్తిన్‌స్కీ గ్రామాన్ని ఖాళీ చేయించనున్నట్టు తెలిపింది. లూనా-25 సోయుజ్‌-2 ఫ్రిగట్‌ బూస్టర్‌ను మోసుకొని నింగిలోకి వెళ్లనుంది. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాంకేతికత అభివృద్ధి, చంద్రుడి అంతర్గత నిర్మాణం, నీళ్లతో సహా అక్కడి వనరుల అధ్యయనానికే ఈ ప్రయోగం. 30 కేజీల పేలోడ్‌ను తీసుకెళ్లే ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయితే ఏడాది పాటు విధులు నిర్వర్తించనుంది.

Social Share Spread Message

Latest News