ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అపూర్వ అవకాశం లభించింది. మరోసారి ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ఐక్యరాజ్యసమితి అత్యున్నత జనరల్ అసెంబ్లీ సెషన్‌లో మాట్లాడనున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు అగ్రభాగం లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధానిగా ఉన్న మోదీ ప్రసంగం కీలకం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి వక్తల జాబితా సిద్దం చేసింది. 76వ వార్షికోత్సవ సమావేశంలో మొదటి రోజే ప్రధాని మోదీ ప్రసంగం ఉండడం విశేషం.
2019లో న్యూయార్క్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఆ సమయంలోనే జరిగిన ఐరాస అత్యున్నత జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. అనంతరం కరోనా వ్యాప్తి రావడంతో వర్చువల్‌గా సమావేశాలు జరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో మోదీ ముందస్తుగా మాట్లాడి ఆ వీడియోను పంపించారు. ఆ వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. ప్రస్తుతం ఇప్పుడు సెప్టెంబర్ 25వ తేదీన జరగనున్న సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. అయితే ఈసారి కూడా వర్చువల్‌గా సమావేశం జరిగే అవకాశం ఉంది.