తాలిబన్లకు తొలి నుంచీ మద్దతుగా నిలుస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం అఫ్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని చెప్పే ప్రయత్నం చేశారు. అఫ్ఘాన్ ప్రజల బానిస సంకెళ్లను తాలిబన్లు తెంచేశారని తాజాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన, పాశ్చాత్య సంస్కృతికి తలొగ్గడంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల సంస్కృతికి అలవాటు పడిన వారు మానసికంగా ఆ సంస్కృతికి తలొగ్గుతారు. ఇది బానిసత్వం కంటే దారుణమైదని మనం గుర్తించాలి. సాంస్కృతిక బానిసత్వ బంధనాలను తెంచడం మరింత కష్టం. అయితే అఫ్ఘానిస్థాన్‌లో ఈ సంకెళ్లు తెగిపోవడం మనం ప్రస్తుతం చూస్తున్నాం అని అన్నారు. రాజధాని కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మళ్లీ ఆఫ్ఘనిస్థాన్‌ను రాజ్యమేలడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తూందో వేచి చూడాలి