తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి భారత జాతి గర్విస్తుందని టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు ఆర్థిక సంపదను సృష్టించి సమాజంలో వారికి హోదా గౌరవం కల్పించి వారి ఉన్నతికు తోడ్పడుతున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. దళిత బంధు పథకం కాదు, ఒక ఉద్యమం అని అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో దళిత జాతి అభ్యున్నతికి మాటలు, మూటలు కట్టుకున్న ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులను ప్రజలు చూశారు అని అన్నారు.