Namaste NRI

TAMA ఆధ్వర్యంలో అట్లాంటాలో నిర్వహించిన స్టెమ్ పేపర్ ప్రెజెంటేషన్ & స్పెల్లింగ్ బీ విజయవంతం

పేపర్ (లేక ప్రాజెక్ట్) ప్రెజెంటేషన్ అన్నది సాధారణంగా కాలేజీ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. మిలీనియల్స్ లో ఎంతో మంది ఎంట్రప్రెన్యూర్షిప్ వైపు సాగుతున్న ఈ కాలంలో, హైస్కూల్ నుంచే వారికి స్టెమ్ (సైన్స్టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్) లో పేపర్ప్రెజెంట్ చేసే అవకాశం వస్తే ఇంకా ముందంజలో ఉంటారు, స్టేజ్ ఫియర్ తగ్గుతుంది, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఇది గ్రహించి,నాన్ ప్రాఫిట్ సంస్థల చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తామా వారు పరిచయం చేశారు. అలానే, స్పెల్లింగ్ బీ లాంటి పోటీలు మామూలుగా అయితే స్కూల్స్ లో జరుగుతూ ఉంటాయి. స్థానిక షారన్ కమ్యూనిటీ భవనంలో శనివారం, డిసెంబర్ 9న తామా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) నిర్వహించిన స్టెమ్ పేపర్ ప్రెజెంటేషన్ & స్పెల్లింగ్ బీ విశేష ఆదరణ చూరగొంది.

జాతీయ తెలుగు సంస్థ ఆటా మరియు జర్నల్ అఫ్ స్టెమ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ శ్రీ. పి. కె. రాజు గారి సహకారం తో జరిగిన ఈ పోటీలలో తల్లిదండ్రులు, వీక్షకులు, పోటీదారులు దాదాపు 250 మందికి పైగా రికార్డు స్థాయిలో హాజరయ్యారు. డి ఎన్ ఏ, నేల పరిరక్షణ,గుండె పరికరం, వేద విజ్ఞానం, కర్నాటిక్ సంగీతం, నీటి శుద్ధి వంటి ఎన్నో వైవిధ్యమైన అంశాలతో సాగిన పేపర్ ప్రెజెంటేషన్అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. విజ్ఞాన మరియు వ్యాపార దృక్పథాలలో వీరి ప్రదర్శన సాగడం గమనార్హం. వీరికి వివరంగా పేపర్ రాసి సమర్పించడానికి జనవరి దాకా గడువు ఉంది. బాగా ఉన్నవాటిని ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురిస్తారు. స్పెల్లింగ్ బీ లో 3వతరగతి వరకు, 3 నుండి 5 వ తరగతి, మిడిల్ స్కూల్ (6 నుండి 8 వరకు) ఇలా 3 వర్గాలుగా విభజించడం జరిగింది. ప్రతి వర్గంలో చిన్నారులు అద్భుతంగా స్పెల్లింగులు చెప్పడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టింది. ఈ విధంగా కిండర్ గార్టెన్నుండి హై స్కూల్ వరకు ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థు లందరినీ వైజ్ఞానికవిద్యా సంబంధిత విషయమై ఒకే ప్రాంగణంలోకి తీసుకురావడం తామా వారికే చెల్లింది. రెండు పోటీలలో ప్రతి వర్గంలో గెలిచిన ముగ్గురికి బహుమతులు ఇచ్చారు.

తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని మెచ్చుకుని, తామా వారు చేసేవన్నీ ఉపయోగకరమైనవి అనీ, బాగుంటాయ ని, తాము తామాసంస్థ లో చేరుతామని చెప్పి, సభ్యత్వ ప్రక్రియ గురించి వాకబు చేశారు. 2023లో ఇది తామా వారి 31వ కార్యక్రమం, ఇందులో దాదాపు 11, 12 క్రొత్తవి మరియు విన్నూత్నమైనవి. వీటితో పాటు వారం వారం నడిచే తామా ఉచిత క్లినిక్ మరియు తెలుగు మనబడి తరగతులు ఉండనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ‘గివింగ్ తామా – ప్రాచీన కళల సేవ (తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమం కొరకు)’, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా ఇంకా ఎన్నో జరగబోతున్నాయి. వివరాల కోసం www.tama.org ని సందర్శించండి లేదా [email protected] కి ఇమెయిల్ చేయండి.తామా అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి విచ్చేసిన వారందరినీ ఆహ్వానించి, తామా చేయు పలు బహుళ ప్రయోజనకర కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యంగా, యువత మరియు ఆరోగ్యం ప్రాధాన్యంగా చేసిన సరికొత్త కార్యక్రమాలనువిపులీకరించారు. భరత్, దార్శిక, అమృత్, తరుణ్, ఆదిత్య, జయని పేపర్ ప్రెజెంటేషన్ చేసిన తీరు ఆకట్టుకుంది. న్యాయనిర్ణేతలుగా పి హెచ్ డీ చేసిన హేమాహేమీలు డాక్టర్ గణేష్ తోటా గారు, డాక్టర్ స్నేహా తళిక గారు, డాక్టర్ రాఘవ తడవర్తి గారు విచ్చేసి,అమూల్యమైన సలహాలు అందజేశారు. ఎవ్వరూ చేయని విధంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన తామా వారిని అభినందించారు. నిపుణులు ముగ్గురినీ తామా వారు సగౌరవంగా, సముచితంగా సత్కరించారు. స్పెల్లింగ్ బీ లో కష్టతరమైన స్పెల్లింగులు కూడా చిన్నారులు అవలీలగా చెప్పడం తల్లిదండ్రులకు, విచ్చేసిన వారికి అమిత ఆనందాన్ని ఇచ్చింది, నిర్వాహకులకు సవాలుగా మారింది. పిల్లలందరికీ మరీ ఒక్క రౌండ్ తో ముగించకుండా 2 రౌండ్లు కనీస అవకాశం ఇవ్వడం తామా వారి ప్రత్యేకత.

 సునీల్ దేవరపల్లి, తరుణ్ కారుమంచి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఓపికగా చాలా చక్కగా నిర్వహించారు. తామా టీం నుండి శ్రీనివాస్ రామిశెట్టి, శశి దగ్గుల, సత్య గుత్తుల సహకారం అందించారు. డిసెంబర్ 3న అంతర్జాలంలో జరిగిన తామా ద్వైవార్షిక చెస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం ఈ వేదిక మీదే ఇవ్వడం జరిగింది. ఆహూతులందరికీ మంచి నీరు, చిరు తిండి,చాక్లెట్లు, తేనీరు నిర్వాహకులు అందజేశారు. అలానే, కుటుంబానికి ఒకటి చొప్పున తామా టీ షర్టులు ఇచ్చారు న్యాయనిర్ణేతలకు, విద్యార్థులకు, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, వాలంటీర్లకు, స్పాన్సర్లకు, తామా టీం కి, విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలుతెలిపి, సత్య సభను దిగ్విజయంగా ముగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress