Namaste NRI

సందీప్ మాధవ్, మహతి గ్రాండ్ గా ప్రారంభం

సందీప్‌ మాధవ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం మహతి. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రధారులు. శ్రీ పద్మిని సినిమాస్‌ పతాకంపై శివప్రసాద్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి చంద్రమౌళి క్లాప్‌ ఇవ్వగా, పద్మ కెమెరా స్విచాన్‌ చేశారు. సుహాసిని మణిరత్నం స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించగా, తొలి షాట్‌కి రాజారవీంద్ర గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. టైటిల్‌కి తగ్గట్టు మహిళా ప్రాధాన్యత గల కథ ఇదని, ఒక క్రైమ్‌ చేయడం కంటే, జరుగుతున్న క్రైమ్‌ని చూస్తూ ఊరుకోవడం అన్నిటి కన్నా పెద్ద క్రైమ్‌ అని చెప్పే కథాంశమిదని సుహాసిని మణిరత్నం చెప్పారు.

దర్శక, నిర్మాత శివప్రసాద్‌ అద్భుతమైన కథ తయారు చేసుకున్నారు. నా పాత్రలో విభిన్నకోణాలుంటాయి. సుహాసినిగారితో పనిచేయడం ఆనందంగా ఉంది అని సందీప్‌ మాధవ్‌ అన్నారు. తెలుగులో తనకిది మంచి బ్రేక్‌ అవుతుందని దీప్సిక నమ్మకం వ్యక్తం చేసింది. కథని బలంగా నమ్మి చేస్తున్న సినిమా ఇదని దర్శక నిర్మాత శివప్రసాద్‌ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, కెమెరా: రాహుల్‌ శ్రీవాస్తవ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events