ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ అరుదైన ఘనత సాధించింది. ఇంట్రాడేలో కంపెనీ షేరు ఒక శాతానికి పైగా లాభపడి రూ.1,765 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్కు (రూ.7.47 లక్షల కోట్లు)ను అందుకుంది. తద్వారా 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన నాలుగో భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. కాగా ఇన్ఫోసిస్ షేర్లు ఈ ఏడాది 40 శాతానికి పైగా వృద్ధి చెందాయి. భారీ పెరిగిన సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు 16.6 శాతం మాత్రమే బలపడడం గమనార్హం. ఈ ఏడాది ఆదాయం 14.`16 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్ గత నెలలో ప్రకటించింది. మార్జిన్ 22`24 శాతం మధ్య ఉండొచ్చుని పేర్కొంది. డిజిటల్ బిజినెస్ నుంచి కంపెనీ ఆదాయం 42 శాతం పెరిగింది. ఇక జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రతిపాదికన 23 శాతం పెరిగి రూ.5,195 కోట్లుగా నమోదయింది.