రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఈసారి కూడా పోటీ పడేందుకు అమెరికా మాజీ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో ఇప్పటికే ఓ విక్టరీ కొట్టిన ట్రంప్ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీలో ఆయన విజయకేతనం ఎగురవేశారు. దీంతో దాదాపు ఆయనకు అధ్యక్ష అభ్యర్థిగా లైన్ క్లియర్ అయ్యే అవకా శాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యూ హ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు 55 శాతం ఓట్లు పడ్డాయి. ఇక రెండవ స్థానంలో నిక్కి హేలీ ఉంది. వారం క్రితం ఐయోవాలో జరిగిన ప్రైమరీలో కూడా ట్రంప్ నెగ్గిన విషయం తెలిసిందే. న్యూ హ్యాంప్‌షైర్‌లో 22 మంది డిలీగేట్స్ ఉండగా, దాంట్లో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్నట్లు సమాచారం.