కాబూల్‌లో 13 మంది అమెరికన్లు సహా 100 మందికి పైగా ప్రాణాలు పోవడానికి కారకులైన వారికి విడిచిపెట్టమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వైట్‌హౌస్‌లో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ కాబూల్ విమానాశ్రయం దగ్గర పేలుళ్లకు కుట్ర జరుగుతోందని తమ ఇంటెలిజెన్స్‌కు సమాచారం ఉందని వెల్లడిరచారు. వారు ఎక్కడున్నా వెంటాడి వేటాడిపట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ దాడులకు పాల్పడిన వారిని, అమెరికాకు హాని తలపెట్టే వారిని మేము క్షమించం అన్నారు. మాకు దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడడమే మాకు అత్యంత ముఖ్యం అని అన్నారు. ఐసిస్`కే నాయకుల్ని వెతికి పట్టుకొని వేటాడాలని కమాండర్లను ఆదేశించారు. ఆగస్టు 31 డెడ్‌లైన్ లోగా అఫ్గాన్ నుంచి బలగాలను ఉపసంహరిస్తామని, ఉగ్రవాద చర్యలేమీ తమ మిషన్‌ను ఆపలేవని స్పష్టం చేశారు.