Namaste NRI

జ్యోతిక ప్రధాన పాత్రలో అమ్మ ఒడి

జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్‌వై.గౌతమ్‌ రాజ్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌.ప్రకాశ్‌, ఎస్‌ఆర్‌.ప్రభు నిర్మించిన తమిళ చిత్రం రాక్షసి. ఐదేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. తాజాగా ఈ చిత్రం తెలుగులో అమ్మ ఒడి టైటిల్‌తో విడుదలఅవుతున్నది. వడ్డి రామాను జం, వల్లెం శేషారెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం  ట్రైలర్‌ విడుదలైంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే టీచర్‌గా జ్యోతిక నటించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేవారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేస్తున్న ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. నాగినీడు హరీశ్‌ పేరడి, పూర్ణిమ భాగ్యరాజ్‌, సత్యన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. డబ్బింగ్‌, సెన్సార్‌ అనంతరం రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News