భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు గతంలోలా చపాతీలా ఫ్లాట్‌గా లేవని, అవి భారీగా పూరీలా విస్తరించాయని అమెరికా ఇంధన వనరుల మంత్రి జియో ఫ్రే ఆర్ ప్యాట్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య విదేశీ వాణిజ్య ఒప్పందాలపై చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా తాము ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. రెడ్ సీ సంక్షోభం నేపధ్యంలో ఇంధన భద్రత రంగంలో భారత్, అమెరికా సంబంధాలపై ఆయన బదుదలిస్తూ యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడి నుంచి ట్యాంకర్ షిప్‌ను రక్షించేందుకు సత్వర చర్య తీసుకున్న భారత నావికాదళాన్ని ప్యాట్ ప్రశంసించారు. భారత నౌకాదళం చర్య అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా భారతదేశ సామర్థ్యాన్ని చూపిందని ఆయన అన్నారు. హౌతీ క్షిపణి దాడి ఫలితంగా మంటల్లో చిక్కుకున్న ట్యాంకర్ షిప్‌ను రక్షించేందుకు భారత నావికాదళం జోక్యం చేసుకుందని ఆయన చెప్పారు.