అమెరికాలో తెలుగు విద్యార్థులపై దాడులపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగు విద్యార్థు లపై దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సయీద్ మజ్హర్ అలీపై నలుగురు దుండ గులు దాడి చేయడం తీవ్ర కలతకు గురి చేసిందన్నారు. ఇటీవలే ఓహియోలో బీ శ్రేయాష్ రెడ్డిపై కూడా దాడి చేయడంతో అతను మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా తెలుగు విద్యార్థులపై దాడులు జరగ డం ఆందోళనను కలిగిస్తుందన్నారు. తెలుగు విద్యార్థుల భద్రతపై తమ ఆందోళనను అమెరికాకు తెలపాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉన్నత చదువుల కోసమో లేక ఉద్యోగం కోసమో కన్నవాళ్లను, పుట్టిన ఊరును, తోబుట్టువులను, జీవిత భాగస్వా ము లను వదిలి కెరీర్ కోసం, కుటుంబం కోసం ఎంతో మంది ప్రతిరోజు దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్తున్నా రు. ఎవరూ తెలియని కొత్త ప్రదేశంలో వచ్చీ రాని భాషతో ఒక పూట తింటూ మరోపూట పస్తులుంటూ కొందరు చదువుకుంటుంటే మరికొందరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే ఇలా జీవి తంలో ఏదో సాధించాల న్న తపనతో పుట్టినగడ్డను వదిలి విదేశాలకు వెళ్లిన చాలా మందిపై అక్కడ దాడులు జరుగుతు న్నాయి. ఈ దాడుల్లో కొంత మంది అక్కడే ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు తీవ్ర గాయాలపాలవుతు న్నారు. చివరకు ఏ ఆశయంతో విదేశాలకు వెళ్తున్నారో అది నెరవేరక ముందే కొంత మంది గాయాలతో స్వదేశానికి తిరిగి వస్తుంటే మరికొందరు నిర్జీవంగా శవపేటికల్లో భారతగడ్డపై అడుగుపెడుతున్నారని అన్నారు.