శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భూతద్ధం భాస్కర్ నారాయణ. పురుషోత్తం రాజ్ దర్శక త్వం వహించారు. ఈ చిత్రం లో రాశిసింగ్ అరుణ్‌కుమార్, దేవిప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివకుమార్ తదితరులు నటిస్తున్నారు. ట్రైలర్‌ను హీరో విశ్వక్సేన్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహ ద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఆ హత్యలను దిష్టిబొమ్మ హత్యలుగా పోలీసు లు పేర్కొన్నారు అనే న్యూస్ బులెటిన్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఎలాంటి క్లూ వదల కుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ ఎలా పరిష్కరించాడన్నదే కథాంశమని, అనేక మలుపులతో సాగుతుందని దర్శకుడు తెలిపారు.
పురాణాలతో ముడిపడిన ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయని హీరో శివ కందుకూరి తెలిపారు. విభిన్నమైన థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుందని నిర్మాతలు పేర్కొన్నారు. మార్చి 1న ప్రేక్షకుల ముందు కురానుంది. ఈ చిత్రానికి కెమెరా: గౌతమ్ జార్జ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్, నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై, దర్శకత్వం: పురుషోత్తం రాజ్.