Namaste NRI

ఉత్సవం- యూత్‌ఫుల్ నంబర్ ఫస్ట్ కిస్ విడుదల

దిలీప్‌ప్రకాష్‌, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న చిత్రం ఉత్సవం. అర్జున్‌ సాయి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్‌ పాటిల్‌ నిర్మిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, అలీ తదితరు లు నటిస్తున్నారు.   ఈ సినిమాలోని తొలిగీతం ఫస్ట్‌కిస్‌ విడుదలైంది. అనూప్‌రూబెన్స్‌ స్వరపరచిన ఈ పాట ను అనంత్‌శ్రీరామ్‌ రచించారు. తొలిముద్దు తాలూకు అనుభూతులను వ్యక్తం చేస్తూ ఈ పాట చక్కటి సాహి త్యంతో సాగింది. రామ్‌మిరియాల తనదైన శైలిలో ఆలపించారు. ప్రేమ, వినోదం, భావోద్వేగాల కలబోతగా సాగే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా మెప్పిస్తుంది. కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, రచన-దర్శకత్వం: అర్జున్‌ సాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events