Namaste NRI

అందరికీ నచ్చే సినిమా ఇది : మృతిక సంతోషిణి

 శ్రీరామ్‌, రితికా సింగ్‌ నటించిన చిత్రం వళరి.  ఈ చిత్రానికి కె.సత్యసాయిబాబు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఎం.మృతిక సంతోషిణి దర్శకురాలు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు హరీశ్‌శంకర్‌ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందిచారు. వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్‌ కావాలి, ఆ బంగ్లా గురించి మీకు తెలుసా?, అది దెయ్యాల కొంప ఇలా ముగ్గురు మాట్లాడు కుంటూ వుండగా వళరి మూవీ ట్రైలర్‌ మొదలైంది. హారర్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ ట్రైలర్‌లో రితికా సింగ్‌ నటన బావుంది. శ్రీరామ్‌ పాత్ర కీలకం అని తెలుస్తున్నది.  దర్శకురాలు మృతిక సంతోషిణి మాట్లాడుతు వళరి  అనేది ఓ ఆయుధం. అది బూమ రాంగ్‌లా పనిచేస్తుంది. మనం చేసే కర్మ తిరిగి అది మన దగ్గరకే వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. అందరికీ నచ్చే సినిమా ఇది అని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events