మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి షోరీల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్స్‌లో విడుదల చేశారు. పిసిఎక్స్ ఫార్మాట్లో తొలిసారిగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ట్రైలర్ చాలా బావుం ది. చాలా అరుదైన సినిమా ఇది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా పాషన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అని అన్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ దర్శకుడు విద్యాధర్ విజన్‌ని బలంగా నమ్మాము. అన్ని సినిమాలు వేరు ఈ సినిమా ఇచ్చిన కిక్ వేరు.
చిన్న టీంతో మొదలుపెట్టి ఈ రోజు ఇంత బిగ్ స్క్రీన్‌లో ట్రైలర్ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇందు లో మాస్ డైలాగులు, ఫైట్స్, ఐటమ్ సాంగ్స్ ఉండవు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫీలింగ్ సెకండ్ హాఫ్ లో వుంటుంది. ప్రతి తెలుగు ఫిల్మ్ మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది అని పేర్కొన్నారు. దర్శకుడు విద్యాధర్ కాగిత మాట్లాడుతూ గామి సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ఏర్పడుతుంది. దాని కోస మే ఇన్నేళ్ళు కష్టపడ్డాం. మార్చి 8న కొత్తరం తెలుగు సినిమాని చూస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాందినీ చౌదరి, కార్తీక్ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.