తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పతంగ్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తు న్నారు. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తు న్నారు. ఈ చిత్రంలో ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా, నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతు న్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్‌ను ప్రసాద్ ఐమ్యాక్స్‌లో జరిగిన వేడుకలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బుచ్చిబాబు సానా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. మరో అతిథి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఈ సినిమా కాంటెస్ట్‌లో విజేతల కు బహుమతులను అందజేశారు.
చిత్ర దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ సినిమా టీజర్ నచ్చితే అందరికి సినిమా నచ్చినట్లే. ఒక తెలుగు కమర్షియల్ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఇందులో ఉంటాయి టీజర్‌లో చెప్పినట్లుగా మ్యాచ్‌లో కలుద్దాం అని తెలిపాడు. ఈ కార్యక్రమంలో ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రణీత్ పత్తిపాటి, ఆటా సందీప్ మాస్టర్, మాజీ ప్లార్లమెంట్ సిరిసిల్ల రాజయ్య, నటి శాన్వి, రవిప్రకాష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.