భారతీయులు మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్ అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ భారత్, మాల్దీవులు మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని అన్నారు. కొత్తగా ఎన్నికైన తమ దేశ ప్రభుత్వం భారత్‌లో కలిసి పనిచేయాలని అనుకొంటున్నదని, తాము ఎల్లప్పుడూ శాంతియుత, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుం టామని చెప్పారు.
మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. భారత్‌పై పలువురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది.