ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారికి శాఖలు కేటాయించారు.
చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి) – సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, జీఏడీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు).
కొణిదెల పవన్ కళ్యాణ్ (ఉప ముఖ్యమంత్రి) – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ.
నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ.
కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ.
కొల్లు రవీంద్ర – గనులు అండ్ జియాలజీ, ఎక్సైజ్.
నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌర సరఫరాలుబీ వినియోగదారుల వ్యవహారాలు.
పి.నారాయణ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్.
వంగలపూడి అనిత – హోంశాఖ, విపత్తు నిర్వహణ.
సత్యకుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ.
నిమ్మల రామానాయుడు – జలవనరుల అభివృద్ధి శాఖ.
ఎన్.ఎమ్.డి.ఫరూక్ – మైనార్టీ, న్యాయశాఖ.
ఆనం రామనారాయణరెడ్డి – దేవాదాయశాఖ.
పయ్యావుల కేశవ్ – ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాలు.
అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ.
కొలుసు పార్థసారధి – గృహ నిర్మాణం, సమాచార శాఖ.
డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ.
గొట్టిపాటి రవి కుమార్ – విద్యుత్ శాఖ.
కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ.
గుమ్మడి సంధ్యారాణి – గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ.
బీసీ జనార్థన్ రెడ్డి – రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు.
టీజీ భరత్ – పరిశ్రమలు, వాణిజ్యం.
ఎస్.సవిత – బీసీ వెల్ఫేర్, చేనేత సంక్షేమం, జౌళి.
వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ.
కొండపల్లి శ్రీనివాస్ – చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు.
మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి – రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు.