అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్, తాను వెనక్కి తగ్గకపోవచ్చన్న సంకేతాలను ఇచ్చారు. వార్ధక్యంతో వచ్చిన తన ఇబ్బందులను ఆయన అంగీకరిం చారు. అయితే నిజాలు మాట్లాడటం ఒక్కటే తనకు తెలుసని తెలిపారు. త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ పక్షాన బైడెన్‌లు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అట్లాంటాలో వీరిద్దరి మధ్య 90 నిమిషాల పాటు జరిగిన సంవాదంలో బైడెన్ పలుమార్లు తడబడ్డా రు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యం లో బైడెన్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో భార్య జిల్, కుమారుడు హంటర్, మనుమలు సహా పలవురు పాల్గొన్నారు. మరోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి పోరాటాన్ని కొనసాగిం చాల్సిందిగా బైడెన్‌కు వారంతా సూచించారు. బాసటగా ఉంటామని ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
