ఎయిర్ యూరోపా కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డా రు. దీంతో విమానాన్ని బ్రెజిల్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ యూరోపా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం 325 మంది ప్రయాణికులతో సోమవారం స్పెయిన్ లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే రాజధాని మాంటెవీడియో కు బయల్దేరింది. అయితే మార్గం మధ్యలో విమానంలో అల్లకల్లోలం నెలకొంది. తీవ్రమైన కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు వారి సీట్ల నుంచి కిందపడిపోయారు. ఓ ప్రయాణికుడు ఏకంగా ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు.