![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-6.jpg)
అమెరికాలో దొంగతనం చేసేందుకు ఫ్లాట్‌లో చొరబడ్డ దుండగుడు ఓ యువతిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నేపాల్‌కు చెందిన విద్యార్థిని మునా పాండే (21) ప్రాణాలు కోల్పోయిందని, నిందితుడు బాబీ సిన్హ్ షా (52) భారత సంతతి పౌరుడని పోలీసులు తెలిపారు. పోలీసులు బాబీ సిన్హ్ షాను నిందితుడిగా పేర్కొంటూ ఫొటోను విడుదల చేశారు. అతడిని అరెస్టు చేసినట్టు తెలిపారు. కాల్పుల ఘటన గత సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో జరిగినట్టు తెలిపారు. 2021లో నేపాల్ నుంచి అమెరికాకు వచ్చిన మునా పాండే, హూస్టన్‌లోని కమ్యూనిటీ కాలేజ్‌లో చదువుకుంటున్నది. రక్తం మడుగులో పడివున్న ఆమె మృతదేహం పోలీసులకు లభ్యమైనది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-4.jpg)