![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-6.jpg)
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న ఉత్తర కొరియాకు పుతిన్ బహుమ తులు పంపుతున్నారు. ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అత్యంత ఇష్టమైన 24 గుర్రాలను పుతిన్ అందజేశారు. కిమ్ బాగా ఇష్టపడే ఒర్లావో ట్రోటర్ జాతి గుర్రాల్ని పుతిన్ తెప్పించారట. రెండేండ్ల క్రితం 30 ఒర్లావో ట్రోటర్ గుర్రాల్ని కిమ్‌కు అందజేయగా, వాటిపై స్వారీ చేస్తూ కిమ్ జోంగ్ ఉన్ తెగ మురిసిపోయారు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరిన క్రమంలో ఇరు దేశాల అధినేతలు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారని తెలిపింది. కిమ్ ఈ ఏడాది జూన్‌లో పుతిన్‌కు అరుదైన శునకాల్ని బహుమతిగా పంపగా, పుతిన్ ఆగస్టులో కిమ్‌కు 447 మేకల్ని పంపారట.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-8.jpg)