![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-28.jpg)
అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రాడామస్‌గా పేరొందిన ఎన్నికల విశ్లేషకుడు అలన్ లిచట్మన్ ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరో ప్రకటించారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిసే వైట్‌హౌస్ పీఠాన్ని దక్కించుకుంటారంటూ ఆయన జోస్యం చెప్పారు. అగ్రరాజ్య కాబోయే అధ్యక్షురాలు హారిస్ అంటూ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ పోటీలో ఉన్నారు. కాగా కీస్ టు వైట్ హౌస్ విధానంలో అధ్యక్షుడు ఎవరో గత 40 ఏండ్లుగా ఆయన కచ్చితంగా జోస్యం చెబుతూ వస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-26.jpg)