Namaste NRI

తండేల్‌ నుంచి న్యూ పోస్టర్‌ రిలీజ్ 

నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం తండేల్. సాయిపల్లవి కథానాయిక. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం. తండేల్ లో చైతూ నట విశ్వరూపాన్ని చూస్తారని, మేకర్స్ తెలియజేస్తూ, నాగచైతన్యకు సంబంధించిన ఓ న్యూ పోస్టర్ని విడుదల చేశారు. సముద్రపు అంచున ఫిషింగ్ బోట్పై నిలబడి రగ్గ్డ్ అవతార్లో చిరునవ్వులు చిందిస్తున్న చైతూ పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకునేలా వుంది. శ్రీకాకుళంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: షామ్దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాత: బన్నీ వాసు, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: గీతా ఆర్ట్స్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events