Namaste NRI

పుతిన్‌ గ్రీన్‌సిగ్నల్‌… కానీ షరతులు వర్తిస్తాయి

ఉక్రెయిన్‌తో రెండేళ్లకు పైగా యుద్ధం సాగిస్తున్న రష్యా తాజాగా శాంతిచర్చలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఉక్రెయిన్‌ సంక్షోభంపై తాము భారత్‌ సహా చైనా, బ్రెజిల్‌ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. ఈ మూడు దేశాలు ఈ సంక్షోభ నివారణకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నాయని, మాస్కో-కీవ్‌ మధ్య శాంతియుత చర్చలకు అవి మధ్యవర్తిత్వం వహించగలవని పుతిన్‌ పేర్కొన్నారు. వ్లాడివ్‌స్టోక్‌లో జరిగిన ఈస్టర్న్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (ఈఈఎఫ్‌) ప్లీనరీ సెషన్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభంపై చర్చలు జరపాలని ఒకవేళ ఉక్రెయిన్‌ కోరుకుంటే దానికి నేను సిద్ధమే అని శాంతి చర్చలకు తన సమ్మతి తెలిపారు. అయితే 2022లో ఇస్తాంబుల్ లో కుదిరిన, తర్వాత రద్దయిన రష్యా, కైవ్ ఒప్పందం ఆధారంగానే చర్చలు జరుపుతామని, నాటి ఒప్పందం నిబంధనలను ఎన్నడూ బహిర్గతం చేయలేదని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events