కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఒక వినూత్నమైన ప్రత్యేకత వుంది, ముఖ్యంగా తెలంగాణ జానపద కళాకారులు తెలంగాణ అస్తిత్వ చాటుతూ ఆలపించే తెలంగాణ జాన పద బతుకమ్మ పాటలు ప్రేక్షకులను మనం తెలంగాణాలోనే బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకొంటు న్నామా అనిపించేలా ఆటలు పాటలు ఎంతో ఉత్సాహం గ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉత్సాహభరితం గా బతుకమ్మ సంబరాలలో పాల్గొనే విధం గా చేయటమే ప్రత్యేకత కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసి యేషన్ బతుకమ్మ పండుగ సంబరాలకి మీకిదే మా ఆహ్వానం! ఈ సారి కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ పండుగ సంబరాలకి చాలా ప్రత్యేకతలు వున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Mayfair-48.jpg)
బతుకమ్మపండుగ, తెలంగాణా సాంస్కృతిక చిహ్నం, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Ixora-48.png)