కొవిడ్ 19 వైరస్ పుట్టుకకు ప్రధాన కేంద్రంగా ఉన్న చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కీలక ప్రకటన వెలువ డింది. ఇప్పటివరకు పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్ అన్నింటినీ ఎదుర్కొనే నానో వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్టులు తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నో వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నా, ఇవి సార్వత్రిక రక్షణ కల్పించలేవు. దీంతో నానో వ్యాక్సిన్ ను తయారుచేసినట్టు సైంటిస్టుల బృందం తెలిపింది. గబ్బిలాలు, ఇతర జంతువులపై పరిశోధనలు జరుపుతున్న ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందని గతంలో పలు దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి.