ఆగస్టు 29న కాబూల్‌లో ఐఎస్‌ఐఎస్ కే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక దళాలు డ్రోన్ దాడి చేశాయి. ఈ దాడిలో ఏడుగురు చిన్నారులతో పాటు పదిమంది మృతి చెందారు. ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ విచారణ వ్యక్తం చేశారు. ఈ దాడిపై ఆయన పెంటగాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది మా పొరపాటు. ఈ దాడికి నేను బాధ్యత వహిస్తూ క్షమాపణలు కోరుతున్నాను. ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని అన్నారు. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే యోచనలో అమెరికా ఉన్నట్లు మెకెంజీ తెలిపారు.