Namaste NRI

ప్రపంచంలోనే తొలిసారి.. స్విట్జర్లాండ్ లో

ఓ వ్యక్తి ఆత్మహత్య పేటిక సహాయంతో సూసైడ్ చేసుకున్న సంఘటన స్విట్జర్లాండ్ లో జరిగింది. సదురు వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి పలువురు సహకరం అందించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరో వ్యక్తి సహాయంతో ఆత్మహత్య చేసుకొని పేటికను సూసైడ్ క్యాప్సుల్స్, సార్కో  అని కూడా అంటారు. ఇప్పటివరకు దీనిని ఎవరూ ఉపయోగించి ఆత్మహత్య చేసుకోలేదు. ఒక మనిషి పట్టేంత పేటిక  ఉంటుంది, దాని లోపలికి వెళ్లి బటన్ నొక్కితే నైట్రోజన్ వాయువు విడుదల అవుతుంది.

పేటిక లోపల ఉన్న వ్యక్తి నిమిషాల వ్యవధిలో స్పృహ కోల్పోయి ఊపిరాడక చనిపోతాడు. మేరీషాజన్ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంటిలో ఆత్మహత్య పేటిక సహాయంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి మరో వ్యక్తి ప్రేరిపించి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని ద్వారా ఒక్కరే ఆత్మహత్య చేసుకోలేరని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events