Namaste NRI

అంచనాలు పెంచేస్తోన్న వేట్టయన్ .. ఎన్‌కౌంటర్‌ స్పెష లిస్ట్‌గా సూపర్‌ స్టార్‌

రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం వేట్టయాన్‌-ది హంటర్‌. టీజే జ్ఞానవేల్‌ రాజా దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు.అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికాసింగ్‌, దుషరా విజయన్‌, రోహిణి, అభిరామి తదితరులు నటిస్తున్నారు.  బుధవారం ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్‌ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్‌ను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోనే పేరుపొందిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా చూపించారు. మనకు ఎస్పీ పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు అంటూ నేరస్థులంతా వేట్టయాన్‌ను చూసి హడలిపోతుంటారు.

అసాంఘిక శక్తుల ఆటకట్టించే పవర్‌ఫుల్‌ పోలీస్‌గా రజనీకాంత్‌ నటన ఆకట్టుకుంది. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వేట్టయాన్‌ జీవితంలో తెలియని కోణాలేమిటి? అతను ఏ లక్ష్యం కోసం బయలుదేరాడు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events